calender_icon.png 14 August, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోపించిన పారిశుద్ధ్యం..

14-08-2025 12:31:31 AM

  1. పడకేసిన అభివృద్ధి..

ఏజెన్సీలో విజృంభిస్తున్న జ్వరాలు 

స్పందించని అధికారులు 

జిల్లా వ్యాప్తంగా పడకేసిన పారిశుధ్యం 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13, (విజయక్రాంతి):అసలే వర్షాకాలం... లోతట్టు ప్రాంతాలన్నీ చిత్తడి మయం... వర్షపు నీటితో జలమయం. రోడ్లపై పడిన గుంత లు, గుంతల్లో వర్షపు నీరు చేరి విజృంభిస్తున్న దోమలు. దోమ కాటుకు బలై విష జ్వ రాల బారిన పడుతున్న ఏజెన్సీ వాసులు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ఒక కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీలు, 22 మండల కేంద్రాలు, 471 గ్రామపంచాయతీల పరిస్థితి.

పాలకవర్గాలు లేక, ప్రత్యేక అధి కారుల పర్యవేక్షణ కరువై అపరిశుభ్రత తాం డవిస్తోంది. అభివృద్ధి అటుకెక్కింది. అంటు వ్యాధులు ప్రబలి జనం ఆసుపత్రి ఫాలో అవుతున్న స్పందించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.

జిల్లాలో అడపా తడపా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామాలు పట్టణాల్లో ఎటు చూసినా మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోయింది. ప్రధాన రహదారులపై డ్రైనేజీ నేరు ప్రవహిస్తోంది. పంచాయితీలు, పట్టణాల్లోనూ పారి శుద్ధ్యం అధ్వానంగా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే...

గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు నిధుల లేమితో ఎక్కడి వేసిన గొంగ ళి అక్కడే అన్న చందాన ఉన్నాయి. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా ప్రారంభించిన నూతన పంచాయతీ భవన నిర్మాణాలు నిధులు లేక అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

అశ్వరావుపేట మండలం రెడ్డి గూడెం గ్రామపంచాయతీ భవనం, టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామపంచా యతీ భవనం ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచి పోవడం అందుకు చక్కని నిదర్శనం. అసంపూర్తి భవనాల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి పందులు నిలయంగా మా రాయి. 

ఇలా ఉంటే విష జ్వరాలు ప్రభలవా?

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోను పారిశుధ్యం పడకేసింది. గ్రామా ల్లో ఎటు చూసినా మురుగునీరు తో స్తంభించిపోయింది. ప్రధాన రహదారులపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తోంది. అసలే సీజన్ 4 వ్యా ధులు ప్రభలేకాలం కావడం, ఆటో గ్రామ పంచాయతీలోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్యం అధ్వానంగా మారడం పై ప్రజ లు భయాందోళన చెందుతున్నారు.

జిల్లా స్థాయి అధికారులు స్పందించాలి 

జిల్లావ్యాప్తంగా పడకేసిన పారిశుధ్యం పై జిల్లాస్థాయి అధికారులు, కార్పొరేషన్, ము న్సిపాలిటీలలో మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి పరిశుభ్రతను నెలకొ ల్పాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు డి మాండ్ చేస్తున్నారు.