calender_icon.png 14 August, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంగుతున్న రోడ్లు.. కూలుతున్న డ్రైనేజీలు

14-08-2025 01:06:15 AM

  1. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అడుగడుగున పొంచి ఉన్న ప్రమాదం 

పనులపై పర్యవేక్షణ పట్టని జీహెచ్‌ఎంసీ అధికారులు 

వర్షాల సమయంలోనే అధికారుల హడావుడి 

ముందుచూపు లేని అధికారులు, ప్రజాప్రతినిధులు 

ప్రజల నుంచి తీవ్ర విమర్శలు 

ఎల్బీనగర్, ఆగస్టు 13 : గత వారం రోజులుగా నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వ ర్షాలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఏ డివిజన్ చూసిన అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది..... అసంపూర్తిగా మిగిలిన ట్రంక్ లైన్, బాక్స్ డ్రైన్ నాలాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో ముంపు సమస్య తీరకపోగా... మరింత ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాల వరద నీరు పారుతుండడంతో ఎక్కడ మ్యా న్ హోల్స్ తెరిచి ఉన్నా యో?...

ఎక్కడ డ్రైనే జీ పొంగిందో? ఎక్కడ రోడ్డు కుంగుతుందో? తెలియని అయోమయ, ఆ భద్రత పరిస్థితి. ఎక్కడ కరెంట్ తీగలు తెగిపడుతాయో... ఎక్క డ కరెంట్ స్తంభాలు కూలి పడుతాయో అని ప్రజలు బిక్కుబిక్కున గడుపుతున్నారు. వాన వస్తే తమ ఇంటి నుంచి ఆచితూచి అడుగు లు వేస్తున్నారు. నియోజకవర్గంలో గత వా రం రోజులుగా ఇదే సమస్య వెంటాడుతుంది. సమస్యలను చక్కదిల్లాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు ఉత్సవ విగ్రహాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటూ ప్రజల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి.

 ఎక్కడ పనులు అక్కడే 

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో వరద ముంపు పనులు, డ్రైనేజీ పనులు పూర్తి కాలేదు. కొన్ని కాలనీల్లో ప్రారంభించి, మధ్యలో వదిలేయగా... కొన్నిచోట్ల చిన్నచిన్న పనులు పూర్తికాలేదు. భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలా ప్రాంతా లు చెరువులను తలపిస్తున్నాయి. నీటిని తొ లగించేందుకు చాలాచోట్ల మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయి.

ఇటీవల టీకేఆర్ కమాన్ రో డ్డు పరిధిలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ నాలా లో పడి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. వరదలో రోడ్డు కనిపించకపో వడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. హయత్ నగర్ జాతీయ రహదారి పై సర్వీస్ రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. 

వానాకాలం రాకముందు పూర్తికాని పనులు 

శివారు ప్రాంతాలు, లోతట్టు కాలనీల్లో ముంపు నివారణకు ట్రంక్ లైన్, బాక్స్ డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. అయితే, పనులన్నీ వానాకాలం రాక ముందే పూర్తి చేయాలి, కానీ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వివిధ కాలనీల్లో పనులన్నీ అసంపూర్తిగా మిగిలిన ఉంటున్నాయి. ముంపు నివారణ పనులకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నా...

అధికారుల అలసత్వంతో సకా లంలో పనులు పూర్తి కావడం లేదు. వేసవికాలంలోనే డ్రైనేజీ పైప్ లైన్లు, నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలి. డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మతులు, ఓపెన్ నాలాల్లో పూడికతీత, కొత్తగా నాలాల నిర్మాణం చేపట్టి ముంపు సమస్యలను పరిష్కరించాలి. కానీ, జీహెచ్‌ఎంసీ అధికారులు కార్యాలయాల్లో కూర్చుని ఉంటే పనులు ఎలా పూర్తవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అజమాయిషీ లేకపోవడం... నిధులు సరిపోవడం లేదని... బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు చేపట్టిన పనులను పూర్తి చేయడం లేదు. బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం వనస్థలిపురం, మన్సూరాబా ద్, హయత్ నగర్, నాగోల్ డివిజన్లలో అనే క కాలనీల్లో చేపట్టిన డ్రైనేజీ, ట్రంక్ లైన్, బాక్స్ డ్రైన్ నాలాల నిర్మాణాలు సగంలో నిలిచాయి. 

కూలుతున్న డ్రైనేజీలు... 

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో నాణ్యతా ప్రమాణాల లోపంతో నిర్మించిన డ్రైనేజీలు, రోడ్లు భారీ వర్షాలకు కుంగి, కూలిపోతున్నాయి. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు నాణ్యత లేకపోవడంతో స్వల్పకాలంలోనే కూలిపోతున్నాయి. చైతన్యపురి, కొత్తపేట, గడ్డి అన్నారం, లింగోజిగూడ డివిజన్లలోని అనేక కాలనీల్లో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి.

మరమ్మతులు లేకపోవడంతో ప్రమాదకరం గా మారుతున్నాయి. వానాకాలంలో వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఆయా డివిజన్లలో చేపట్టిన బీటీ రోడ్లు కుంగిపోతున్నాయి. దీంతో అధికారులు, కాంట్రాక్టర్లు పనితీరుకు నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.