calender_icon.png 31 July, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా కబ్జా

31-07-2025 12:04:00 AM

- ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

- ఆక్రమించి భారీగా కమర్షియల్ నిర్మాణాలు

- రూ.కోట్ల విలువ చేసే స్థలాలకు ఎసరు

-  కళానగర్‌శివాలయం గుడి కట్టింది ఈ స్థలంలోనే 

- పెద్దఅంబర్‌పేట్‌మున్సిపాలిటీ పరిధిలో బాగోతం

- పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్‌అధికారులు

- భూములను కాపాడాలని హైడ్రాపైనే ఆశలు 

ప్రభుత్వ భూమే కదా.. అడిగేవారు ఉండరని కావొచ్చు యథేచ్ఛగా కబ్జాచేసేశారు. ప్ర భుత్వం తీసుకొచ్చిన భూభారతిలోనూ వివరాలు లేకుండా చేసేశారు. కోట్ల రూపాయలు పలుకుతుందని కావొచ్చు భారీ కమర్షియల్ నిర్మాణాలను చేపట్టి అక్రమంగా సం పాదిస్తున్నారు. కానీ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు గప్ చుప్ గా ఉంటున్నారు. 

రంగారెడ్డి,అబ్దుల్లాపూర్‌మెట్ ( విజయ క్రాంతి)జులై 30: పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతం కావ డంతో ఇక్కడి భూములకు విపరీతమైన ధర లు పెరిగి.... అక్రమార్కులకు రెక్కలొచ్చాయి. దీంతో ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. గత కొద్ది కాలంగా భూములను ఆక్రమించి నిర్మాణాలను చేపడుతుండ డంతో అధికారులకు ఫిర్యాదులు అందా యి. అయినప్పటికీ నిర్మాణాలు ఆగలేదు. ఈ నిర్మాణాలపై గతంలో సంబంధిత అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగా రెడ్డి దృష్టికి పలువురు తీసుకెళ్లారు. సదరు యజమానులు అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు స్పందించకపోవడంతో వెనుక అంతర్యమేమిటో అర్థం కా వడం లేదు. 

గుడి మాటున స్వాహా!.....

పెద్ద అంబర్‌పేట్‌మున్సిపాలిటీపసుమాములకు వెళ్లే జెడ్పీ రోడ్డుకు అనుకుని పసు మాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 386లో ప్రభుత్వం ఉంది.ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో కోట్లాది రూపాయలు పలుకుతోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలం లో కళానగర్ వాసులు శివాలయం నిర్మించాలని అనుకోని.. చందాలు చేసి గుడి నిర్మా ణా పనులు ప్రారంభించి గుడి కట్టారు. కానీ గుడి నిర్మాణ పనులు పూర్తికాకుండా అక్రమార్కుల కన్ను ఈ ప్రభుత్వ స్థలంపై పడిం ది. దీంతో ఆ శివాలయం నిర్మాణాలను నామరూపంలేకుండా చేసి అక్కడ అక్రమార్కులు కమర్షియల్‌సెటర్లు నిర్మిసున్నారు. ఆ అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు, ము న్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యమేమిటీ అంతుచిక్కడం లేదు. 

భూభారతిలో కనిపించకుండా

పెద్దఅంబర్‌పేట్‌మున్సిపాలిటీ పసుమాముల నుంచి కుంట్లూరుకు వెళ్లే జెడ్పీరోడ్డు కు ఇరువైపులు ప్రభుత్వ భూమి ఉంటుంది. పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్413414లలో దాదాపు 6 ఎకరాలకు వర కు సర్కార్ భూమి ఉంది. ఇందులో కొంత మంది రియల్‌ఎస్టేట్స్ వ్యాపారులు వెంచర్లు చేసి ఆమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. రూ.50వేలకు గజం చొప్పున అమ్ముతున్న ట్లు సమాచారం. అలాగే ఈ రెండు సర్వే నెంబర్లలో భారీ షెడ్డు నిర్మాణం చేపట్టి.. అం దులో చికెన్‌సెంటర్ ను నిర్వహిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లు గతంలో(ఆన్‌లైన్) ధరణి లో భూమి వివరాలు కనిపించేవి. ప్రస్తుతం భూభారతి వచ్చిన తర్వాత (ఆన్‌లైన్) భూ భారతిలో ఈ రెండు సర్వే నెంబర్లకు సంబంధించి భూ వివరాలు కనిపించడం లేదు.

హైడ్రా జాడెక్కడ!

గ్రేటర్‌హైదరాబాద్‌ప్రాంత పరిధిలో ప్ర భుత్వ భూములు, పార్కు స్థలాలు కాపాడాల్సిన బాధ్యత హైడ్రాకు అప్పజెప్పుతూ ప్ర భుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే నగర శివార ప్రాంతమై రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండ లం పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలో ని సర్వే నెంబర్386, 413, 414లలో సుమా రు 6.2 ఎకరాల భూమిని అక్రమార్కుల క బ్జా చేస్తున్నారు. ఈ స్థలాలలో భారీ కమర్షియల్ సెటర్లను నిర్మిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెం బర్ 386లో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలపై గతంలో మా దృష్టికి వచ్చింది. అట్టి ని ర్మాణాలను సైతం కూల్చివేశాం. ప్రస్తుతం అ క్కడ చేపట్టిన అక్రమ నిర్మాణాలపై తప్పకుం డా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు తప్పవు.

  సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ అబ్దుల్లాపూర్‌మెట్