13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఏప్రిల్ 20 వరకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు

27-03-2026 01:41 AM

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): ప్రస్తు త విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. కొత్త దరఖాస్తులు, రెన్యూవల్ చేసుకోవడానికి గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగిస్తూ ఈమేరకు గురువారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు.

స్కాలర్‌షిప్‌లకు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు 1.25 లక్షల మంది ఉన్నారు. వీరిలో ఫ్రెషర్స్ 87,639, రెన్యూవల్ చేసుకునే విద్యార్థులు 37,371 మంది ఉన్నారు. ఈనెల 31న తొలుత ప్రకటించిన గడువు ముగియడంతో మరోసారి ఏప్రిల్ 20 వరకు గడువు పొడిం చారు. గడువులోగా దరఖాస్తు చేసుకునేలా సంబంధిత అధికారులు, కళాశాలల యాజమాన్యాలు చర్య లు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.