24 May, 2026 | 8:44 PM

సంక్షేమ శాఖలో 581 పోస్టులు

17-06-2024 12:25 AM

భర్తీకి పరీక్షల షెడ్యూల్ విడుదల 

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): సార్వత్రిక ఎన్నికలు పూర్తికావడంతో ఉద్యోగ నియామకాల్లో టీజీపీఎస్సీ దూకుడు పెంచింది. ఇటీవల గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ప్రాథమిక కీ ని విడుదల చేసిన అధికారులు.. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని వసతిగృహాల్లో 562 మంది అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్  పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్ 24 నుంచి 29 వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ అధారిత విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

తేదీ సమయం పేపర్, పోస్ట్ కోడ్, సబ్జెక్ట్ 

10 నుంచి 12:30 గం పేపర్ 1, జనరల్ స్టడీస్

24 - 26 2:30 నుంచి 5 పీఎం పేపర్-2, ఎడ్యుకేషన్ 

( బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్‌లెవల్ )

10నుంచి 12:30 పీఎం పేపర్ -1 జనరల్ స్టడీస్ 

2:30 నుంచి5 పీఎం పేపర్ -2 ఎడ్యుకేషన్ 

29 (బ్యాచిలెర్ ఇన్ ఎడ్యుకేషన్‌లెవల్ )

2:30 నుంచి 5 పీఎం పేపర్-2 డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్

2:30 నుంచి 5 పీఎం పేపర్ -2 డిప్లొమా ఇన్ స్పషల్ ఎడ్యుకేషన్