రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు
హయత్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఎంపీ చామల, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్, డిసెంబర్ 7: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీపై గుజరాత్ బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారని, వీరిపై కేసు నమోదు చేయాలని భువ నగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శనివారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్‌గాంధీపై అనుచిత పోస్టులు పెట్టినవారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో జరుగుతున్న వాస్తవాలను బయటకు రాకుండా చేస్తున్నదన్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే బీజేపీ ఎంపీలు, ప్రధాని మోదీ సభను వాయిదా వేస్తున్నట్లు విమర్శించారు. సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడు తూ.. ఎంపీ, ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని, న్యాయవాదుల సలహాతో కేసు నమోదు, దర్యాప్తు చేస్తామని తెలిపారు.




