15 April, 2026 | 12:47 AM

రోడ్డుపై గుంతలు పుడ్చాలి

17-05-2025 12:00 AM

డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 16 (విజ యక్రాంతి): ఆసిఫాబాద్ నుండి అదిలాబాద్ ఎక్స్ రోడ్డు వరకు వెళ్ళే ప్రధాన రోడ్డుపై విపరీతంగా గుంతలు ఏర్పడ్డాయని వాటిని  వెం టనే పూడ్చాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం గుంతలను పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు.  ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. గుంతల వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..

అయినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిం చారు. అధికారులు స్పందించి వెంటనే చర్య లు తీసుకోవాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి గొడిసెల కార్తిక్, ఉపాధ్యక్షురాలు శ్రావణి, నిఖిల్ తదితరులు ఉన్నారు.