17-05-2025 12:00:00 AM
మాజీ మంత్రి ఇంద్రకరణ్
నిర్మల్, మే 16 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దేవాలయాల అభివృద్ధికి దేవాదా య శాఖ మంత్రిగా తాను ఎంతో కృషి చేశానని మాజీ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నా రు. సోన్ మండలంలోని మాదాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి విగ్ర హ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1200 దేవాలయాల కు నిధులు మంజూరు చేయడంతో నిర్మాణాలు పూర్తయి భక్తులు ప్రతినిత్యం పూజలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ పార్టీ నాయకులు రమేష్‌రెడ్డి, గంగారెడ్డి. ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.