16-05-2025 10:22:25 PM
బాలాజీ అసోసియేట్స్ ఫైనాన్స్ పేరుతో ప్రజలకు టోకరా
బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి
పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు
ప్రవేట్ ఫైనాన్స్ దందాను ప్రజలు నమ్మి మోసపోవద్దు: ఎస్ఐ రమేష్
మంథని,(విజయక్రాంతి): మంథని లో ఘరానా మోసం ఓ ఘనుడు. మంథని పట్టణంలో బాలాజీ అసోసియేట్స్ ఫైనాన్స్ పేరుతో ప్రజలకు టోకరా చేశాడంతో బాధితులు ఎట్టకేలకు మంథని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదుతో చేయడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రవేట్ ఫైనాన్స్ దందాను ప్రజలు నమ్మి మోసపోవద్దు మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం మంథని లో శ్రీ బాలాజీ అసోసియేట్స్ ఫైనాన్స్ పేరుతో చైర్మన్ దోమల రమేష్ అనే వ్యక్తి ఇట్టి ఫైనాన్స్ బ్రాంచీలను జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, మంథనిలలో గాథ మూడు నెలల క్రితం ఓపెన్ చేసి ఉద్యోగులను నియమించు కొని వారి ద్వారా కష్టమర్లకు లోన్స్ ఇప్పించుట గురించి లాగిన్ అమౌంటు రూ. 5,100 లోన్ ఇప్పించినందుకు గాను ప్రాసెసింగ్ ఫీజు లక్షకు రూ.3300 గాను ముందుగానే కస్టమర్స్ నుండి వసూలు చేసి అ బ్రాంచీలలో పెద్దపల్లి గోదావరిఖని బ్రాంచీలను ఎత్తివేసి, మంథనిలో కస్టమర్ల లోన్ అమౌంట్ ఇవ్వకుండా, ఉద్యోగులకు గత 2, 3 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా కస్టమర్లను మోసం చేసడని ఎస్ఐ తెలిపారు. డబ్బులు వసూలు చేసిన అతని పై మంథని పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయగా వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని, మండలంలోని ప్రజలు ఇలాంటి వ్యక్తులను నమ్మి ముందుగానే డబ్బులు చెల్లించి మోసపోవద్దని ఎస్ఐ ప్రజలకు సూచించారు. మోసం చేసిన వారిని పట్టుకొని త్వరలోనే ప్రజలు న్యాయం చేస్తామని ఎస్ఐ తెలిపారు.