28 March, 2026 | 3:00 AM

సాహితీ భీష్ముడు పోతుకూచి

28-03-2026 12:54 AM

ఆయన పేరు పోతుకూచి సాంబశివరావు. సాహితీ క్షేత్రంలో ఒక కాలా న్ని శాసించిన సారస్వతమూర్తి. ఆయన ఆశీర్వాదంతో ఎంతోమంది రచయితలయ్యా రు. చిన్న చిన్న కవులు పెద్ద కవులయ్యారు. ఆయన అడ్వకేట్‌గా పనిచేశాడు. కనుక తన జీవితంలో చాలావరకు న్యాయబద్ధంగా ఉం డడానికి ప్రయత్నించాడు. ఆయన కోటు ధ రించి, తలపై టోపీ పెట్టుకొని సభల్లో పాల్గొనేవాడు.

పోతుకూచి సాంబశివరావును నేను మొదటిసారి తెలంగాణలో 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో చూ శాను. ఆయన కార్యక్రమ నిర్వహణాధ్యక్షుడు. నిజాయితీగా వ్యవహరించడం ఆయ నలోని సుగుణం. పోతుకూచికి ఎన్నో రంగాలతో పరిచయం ఉంది. ఆంధ్ర 

తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశాడు. అట్లా రాజకీయానుభవాన్ని సంపాదించాడు. అట్లే న్యాయవాదిగా పనిచేసి జుడీషియల్ రంగంలో అనుభవం సంపాదించాడు. మరి ఆయనకు ఏ దివ్యవాణి ఆదేశం కలిగిందో గానీ సాహితీ రంగంలో ప్రవేశించి తనదైన ముద్రను వేశాడు. సు మారు తన 60 ఏళ్ళ సాహితీ జీవితాన్ని తెలంగాణలో సారస్వత వికాసానికే అంకితం చేశాడు. అందుకే ఆయనను రచయితలు ‘సాహితీ భీష్ముడు’ అని ప్రేమతో పిలుచుకున్నారు.

సాహితీ సంస్థలను స్థాపించి వర్ధమాన రచయితలకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. రచనాపరమైన శిక్షణా శిబిరాలను నిర్వహించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనడానికి ఆయన కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, నాటికలు, జీవిత చరిత్రలే నిదర్శనం. ‘విశ్వసాహితి’ సంస్థను స్థాపించి తన జీవిత కాలమంతా దాని పేరుతోనే ఒక పత్రికను నడిపాడు. తెలుగులోనే కాక ఆంగ్లంలోను పత్రికలను నడిపిన సాహితీవేత్త ఆయన.

మొదట స్థాపించిన సంస్థ ‘నవ్యసాహితి సమితి’. కానీ ఆయనకు పేరు తెచ్చింది ‘విశ్వసాహితి’ మాత్రమే. పోతుకూచి ఎల్‌ఎల్‌బీ చదివే రోజుల్లో ‘ఇది తంతు’ అనే కథను రచించాడు. స్వయంగా దాన్ని నాటకంగా మార్చి, రంగస్థలం మీద నటునిగా పాల్గొన్నాడు. పోతుకూచి ప్రసిద్ధమైన నవల ‘ఉద య కిరణాలు’. ఇది 1955వ సంవత్సరం (నేను పుట్టిన సంవత్సరం)లో రచించబడింది. 1967లో ఇది రష్యన్ భాషలో అను వదింపబడింది.

‘హంతకులు’ అనే నాటకం వారికి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ నాటకానికి ‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ’ అ వార్డు లభించింది. ఆయన వివిధ భాషలను నేర్చుకొని, మంచి అనువాదకుడుగా పేరు గడించాడు. ఆల్ ఇండియా రేడియోలో ‘జాతీయ కవి సమ్మేళనం’ కోసం వివిధ భాషల లోని కవితలను తెలుగులోకి అనువదించాడు. 

నేషనల్ బుక్ ట్రస్ట్ వారి బాల సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకువచ్చిన గౌరవం ఆయనదే. పోతుకూచి సుమారుగా 350 కథలను రచించారు. ‘సంజీవయ్య దర్శనం’ పేరుతో జీవిత చరిత్రను రచించాడు. జాతీ య, అంతర్జాతీయ కవి సమ్మేళనాలలో పా ల్గొన్న పోతుకూచికి ప్రపంచమే సంసారమైంది. బ్రహ్మచర్యం ఆయన నిర్విరామ సా హితీ కృషికి దోహదం చేసిందని చెప్పవచ్చు.

కృష్ణుని భక్తునిగా చెప్పుకోవడం ఆయనకెంతో ఇష్టం. ‘కృష్ణానంద’ బిరుదాన్ని పొం దడం విశేషం. చిత్రమేమంటే ‘కృష్ణ చైతన్య’ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి, కు హనా రాజకీయాలకు తావు లేని విధంగా యువతకు శిక్షణ ఇచ్చాడు.

రాజకీయ ప్రక్షాళన ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని, ఆధ్యాత్మికంగా మానవుని సంస్కరించే పనికి పూనుకున్నాడు. అధికారం లేకున్నా ప్రజా సేవ చేయవచ్చు అంటూ, ‘ఆదేశాలు కృష్ణుడివి - ఆచరణలు మనవి’ అని ప్రకటించాడు. తనకు కృష్ణుడు కనిపించాడని నాకు ఫోన్ చేసి చెప్పడం ఎన్నోసార్లు జరిగింది.

పోతుకూచి 1961లో యునెస్కో సదస్సులో దక్షిణ భారత ప్రతినిధిగా పాల్గొన్నా డు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా, ఆకాశవాణి హైదరాబాద్ సలహా సంఘ సభ్యుడిగా, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా అందించిన సేవలు కొనియాడదగినవి. పోతుకూచి సా హితీ సేవను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాల యం ఆయనకు ‘కళా ప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేసింది.

తెలుగు విశ్వవి ద్యాలయం ఆయనకు పురస్కారాన్ని ఇచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యుడిగా ఉండడమే కాక, 2004 ప్రాంతంలో ఆయన సెన్సార్ బోర్డు సభ్యుడిగా వ్యవహరించాడు. పోతుకూచి ప్రతిభ గలవాడే కాదు, ప్రతిభావంతులను గౌరవించే ప్రవృత్తి గలవాడు. ఆయన సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ‘చెన్నప్ప! వెంటనే మీరు మీ బయోడేటాను ఢిల్లీ అడ్రస్ కు పంపించండి’ అని అడిగాడు. నేను ఎందుకని వారిని అడగలేదు. నాకేదో ప్రయోజనం కలగాలనే వారు నా బయోడేటా అడిగి, ఉంటారని వెంటనే ఆ పని చేశాను.

ఒక వారం తర్వాత పోస్టులో నాకు వచ్చిన లేఖను, లేఖతోపాటు వచ్చిన గుర్తింపుకార్డును చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. అది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ (భారత ప్రభుత్వం) తరఫున ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ సభ్యునిగా అందిన నియామక పత్రం. నేను 2004, 2005 మధ్యకాలం ఫిల్మ్ సెన్సార్ బోర్డు ప్రాంతీయ సభ్యునిగా ఉండటం ఎంతో సంతృప్తి కలిగించింది.

ఆయా సినిమాలను సాకల్యంగా చూసి సలహాలివ్వడం, అశ్లీల దృశ్యాలను నిక్కచ్చిగా తొలగించాలని సూచించడం జరిగింది. అప్పుడు సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్ సంతకంతో వచ్చిన గుర్తింపు కార్డు ఇప్పటిదాకా నా దగ్గర భద్రంగా ఉంది. దాన్ని చూసినప్పుడల్లా పోతుకూచి సాంబశివరావు నాకళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు.

నేను తెలుగు సాహిత్యంలో ఇంచుమించుగా అన్ని ప్రక్రియలలో రచనలు చేశాను. ఐతే కథా ప్రక్రియలో మాత్రం నేను శ్రద్ధ తీసుకోలేదు. ఒక రోజు (అది 2008వ సంవత్సరం) పోతుకూచి వారు ‘చెన్నప్ప గారు! మీరింత వరకు కథలు రాసినట్టు లేదు. కానీ ఇప్పుడు ఆ పని చేయాలి. ‘శ్రీ దామోదరం సంజీవయ్య స్మారక కథల పోటీ’ కి ఒక కథను పంపండి‘ అని కోరారు. నేను సరే అన్నాను.

‘అటూ ఇటూ కానీ’ అనే కథను తాత్విక దృష్టితో రాసి పంపాను. ఇదే నా మొదటి కథ. దానికి పోతుకూచి వారే 2008 సంవత్సరానికి గాను ప్రథమ బహుమతిని ప్రకటించారు. బహుమతి అంటే అదేమీ అంత గొప్పది కాదు. ఆ బహుమతి ప్రేమతో కూడింది. త్యాగరాయ గానసభలో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నూట పదహార్లు, శాలువా, అచ్చైన పుస్తకం తీసుకోవడం ఈనాటికీ గుర్తుంది.