30 August, 2026 | 8:08 PM

Breaking News

గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •   ఎల్లమ్మ తల్లి చల్లని చూపు జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •   విద్యార్థులకు సైక్లింగ్ పోటీ   •  

కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే ఎక్కువ దరిద్రం

19-04-2025 01:24 AM
  1. బీఆర్‌ఎస్ పాలనలో కనీవిని ఎరుగని అభివృద్ధి 
  2. ప్రపంచం చూపు కేసీఆర్ వైపు
  3. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్, ఏప్రిల్ 18(విజయ క్రాంతి): 16 నెలల కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే ఎక్కువ దరిద్రం ఉందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఘట్కేసర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇంత నష్టం జరగలేదని, కాంగ్రెస్ పాలనలో అన్ని విధాల నష్టం జరుగుతోందన్నారు.

రియల్ ఎస్టేట్ లేక పెళ్లిలు చేయలేకపోతున్నారన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాగు, సాగు నీరు లేదని, పెన్షన్లు అందడం లేదన్నారు.

బీ ఆర్‌ఎస్ పాలనలో చరిత్రలో గుర్తుండిపోయేలా అభివృద్ధి జరిగిందన్నారు. కెసిఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రపంచమంతా కెసిఆర్  వైపు చూస్తోందన్నారు. కెసిఆర్ మళ్లీ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

వరంగల్ సభకు తరలి రావాలి 

వరంగల్ లో ఈనెల 27న నిర్వహించనున్న బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఘట్కేసర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ లో వరంగల్ సభ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు