calender_icon.png 20 January, 2026 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగు అడుగుకు విద్యుత్ ఉత్పత్తి

15-11-2024 12:55:41 AM

న్యూఢిల్లీ, నవంబర్ 14: కొత్త ఆవిష్కరణల్లో జపాన్ ఎప్పుడూ ముందుంటుంది. అవకాశమున్న ప్రతిదాంట్లో నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రపంచానికి దిక్సూచిగా వ్యవహరిస్తోంది. తాజాగా పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి కోసం జపాన్ ఎంచుకున్న మార్గం అబ్బురపరుస్తోంది. ఫుట్‌పాత్‌లో ఏర్పాటు చేసే టైల్స్ కింద సాధనాలను అమర్చి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే ప్రక్రియను విజయవంతంగా పరీక్షించింది.

ఒకరోజులో నిరంతరం వీటిపై నడిస్తే 20 బల్బులను వెలిగించేందుకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి జరుగుతుంది. వీటిని ఫుట్‌బాల్, హాకీ మైదానాల్లో ప్రవేశపెడితే మరింత ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు.