calender_icon.png 12 May, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమాయకులను చంపిన పాకిస్థాన్‌కు భారీ మూల్యం

10-05-2025 12:00:00 AM

సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా

ముషీరాబాద్, మే 9 (విజయక్రాంతి) : ఫ్యాసిజంపై రష్యా సాధించిన విజయ స్ఫూర్తితో భారత స్వాతంత్య్ర పోరాటం మరింత ముందుకు పోవడంతో స్వాతం త్య్రం వచ్చిందని, ఆ స్ఫూర్తితో అనేక విముక్తి పోరాటాలు విజయవంతమైయ్యాని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపి, భారత సాంస్కృతిక స్నేహ సంఘం(ఇస్కప్) అధ్యక్ష వర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా అన్నా రు.

భారత సాంస్కృతిక స్నేహ సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్, హిమాయత్ నగర్, అమృత ఎస్టేట్స్, ఇస్కప్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఫ్యాసిజంపై విజయం సాధించిన 80వ వార్షికో త్సవాన్ని పురస్కరించుకొని ఆర్. గోపాల్ అధ్యక్షత సదస్సును నిర్వహించింది.

ఈ సదస్సుకు ఇండియన్ అసోసి యేషన్ అఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, ఇస్కప్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కడారి ప్రభాకర్, ఐప్పో రాష్ట్ర సమన్యయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్, ఇస్కప్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.గోపాల్, అరుణ్ కుమార్, ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షులు మునీర్ పటేల్, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్.శంకర్ నాయక్ హాజరయ్యారు.

అజీజ్ పాషా మాట్లాడుతూ ఫాసిజంపై రష్యా కమ్యూనిజం సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో నయా ఫాసిజంపై పోరాటాలు నిర్మించాలని అయ న కోరారు. పహల్గామ్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు.

అంతకుముందు ఇస్కప్ సభ్యులు విజయలక్ష్మి, కె. శ్రీనివాస్, మహబూబ్ ఆధ్వర్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హిమాయత్ నగర్ నుంచి హైదర్ గూడా వరకు నిర్వహించిన ర్యాలీ అజీజ్ పాషా పాల్గొన్నారు. పాకిస్థాన్ ముర్థాబాద్, హిందూస్థాన్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.