11-05-2025 11:19:27 AM
అమరావతి: సత్యసాయి జిల్లా కల్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్(Brave soldier Murali Naik) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మూడ్రోజుల క్రితం కాశ్మీర్ లో పాక్ సైనికుల కాల్పుల్లో మురళీనాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వ్యవసాయ క్షేత్రంలో ప్రజల సందర్శనార్థం మురళీ నాయర్ భౌతికకాయం ఉంచారు. వీరజవాను మురళీ నాయక్ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. మురళీ నాయక్ భౌతికకాయానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్, ఏపీ మంత్రులు నారా లోకేష్, అనిత నివాళులర్పించారు. కాసేపట్లో అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.