11-05-2025 10:42:04 AM
హైదరాబాద్: మెదక్ జిల్లాలో చిరతపులి సంచారం(Leopard roaming) ఆ తండా వాసులను భయపెడుతోంది. జిల్లాలోని రామాయంపేట మండలం(Ramayampet Mandal) కాట్రియాల తండా సమీపంలో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాట్రియాల తండా సమీపంలో అడవి దుప్పిపై చిరుత దాడి చేసిందని తండా వాసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత మూడు రోజులుగా తండా సమీపంలో చిరుత పులి సంచరిస్తోందని వాపోతున్నారు. చిరుతపులి సంచారంతో తండా వాసులు భయాందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి చిరుతను పట్టుకోవాలని కాట్రియాల తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు.