calender_icon.png 12 May, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సేవించేందుకు వెళ్లి.. వ్యక్తి అనుమానాస్పద మృతి

11-05-2025 11:06:20 AM

హైదరాబాద్: ఆసిఫ్‌నగర్‌ పోలీస్ స్టేషన్(Asif Nagar Police Station) పరిధిలోని ఒక వైన్ షాపు దగ్గర ఒక వ్యక్తి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించడం ఆ ప్రాంతంలో నిరసనలకు దారితీసింది. జిర్రా టప్పాచబుత్ర నివాసి అయిన జమీల్ అనే వ్యక్తి ఆసిఫ్‌నగర్‌లోని చంద్ర వైన్స్ కు వెళ్ళాడు. కొద్దిసేపటి తరువాత అతను వైన్ షాపు బయట చనిపోయి కనిపించాడు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానిక ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(All India Majlis-e-Ittehadul Muslimeen)పార్టీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని వైన్ షాపును మూసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆ వ్యక్తి మద్యం షాపు పర్మిట్ రూమ్ లో మరణించాడని, కానీ యజమానులు మృతదేహాన్ని రోడ్డుపై పడేశారని వారు ఆరోపించారు. పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసి, కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.