నేడు ‘కండ్లకోయ’ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ఏఈ విజయ్ కుమార్
మేడ్చల్ అర్బన్ జూన్ 21(విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని కండ్లకోయ మున్సిపల్ పట్టణ సమీపంలో గల 33/11 కెవి విద్యుత్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ రూరల్ ఎఈ కె విజయ్ కుమార్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్ ల కింద వేపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు11 కెవి సిఎంఆర్ ఫీడర్,11కె.వి ఐడిఏ కండ్లకోయ మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయం త్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు.
నేడు విద్యుత్ సరఫరా జరగని ప్రాంతాలు సిఎంఆర్ కళాశాల.హోటల్ సింధు.హెచ్.పి పెట్రోల్ బంక్.రాగా కావేరి సీడ్స్.సుతారీగుడా,ఆక్సిజన్ పార్క్,జీవీకే ప్రాంతాలలో విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.నేటి విద్యుత్ అంతరాయానికి మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజలు,మాజీ ప్రజా ప్రతినిధులు,రాజకీయ నాయకులు,వ్యాపార వాణిజ్య వేత్తలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని విద్యుత్ ఎఈ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
మేడ్చల్ పట్టణంలో..
మేడ్చల్ అర్బన్ జూన్ 21(విజయక్రాం తి):విద్యుత్ మరమ్మత్తుల కారణంగా నేడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేనున్నట్లు మేడ్చల్ విద్యుత్ టౌన్ ఎఈ రాంబా బు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్ ల కింద వేపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించుటకు కిష్టాపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కెవి కేఎల్‌ఆర్ ఫీడర్,పరిధిలో విద్యుత్ నిలిపివేనున్నట్లు ఆయన చెప్పారు.నేడు వి ద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు కేఎల్‌ఆర్ ఫేస్1,కెఎల్‌ఆర్ ఫేస్2,కేఎల్‌ఆర్ ఫేస్3 లకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు ఏఈ రాంబాబు స్పష్టం చేశారు.నేటి విద్యుత్ అం తరాయానికి కేఎల్‌ఆర్ ఫేస్ 1.2.3 కాలనీ ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్ కేసర్, జూన్ 21 (విజయక్రాంతి): చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల కారణంగా సోమవారం పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఘట్కేసర్ విద్యుత్ ఏఈ ప్రసన్నాంజనేయులు తెలిపారు. 11 కె.వి మాదారం ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు మాదారం, మాదారం ఏజీఎల్, మాదారం పౌల్ట్రీ ఫారమ్స్, 11 కె.వి ఎన్ ఎఫ్ సి నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్ ఎఫ్ సి నగర్, ప్రశాంత్ నగర్, శ్రీనివాస్ హేమాద్రి కాలనీ, బొక్కోనిగూడ పరిధిలో బొక్కోనిగూడ, పరమేశ్వరి నగర్, దత్తాత్రేయ కాలనీ లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని కావున వినియోగదారులు సహకరించాలని ఏఈ ప్రసన్నాంజనేయులు కోరారు.






