22 June, 2026 | 1:37 AM

సిద్దిపేట రూరల్ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన నవత

22-06-2026 12:15 AM

సిద్దిపేట రూరల్, జూన్ 21: సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్త్స్రగా డి. నవత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సీసీఎస్‌ఆర్బీలో విధులు నిర్వహిస్తున్న ఆమె బదిలీపై రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇక్కడ ఎస్త్స్రగా పనిచేస్తున్న రాజేష్ పోలీస్ కమిషనరేట్కు బదిలీ అయ్యారు.

ఈ సందర్భంగా నవత మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. అక్రమ వ్యాపారాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.