యెజ్డీ రోడ్ స్టర్ తొలి కస్టమర్‌గా పీఆర్ శ్రీజేష్
కేరళ, ఆగస్ట్ 12: ఇటీవల ప్రారంభించబడిన 2026 జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ త మ కొత్త మోడల్ సేల్స్‌ను మొదలుపెట్టింది. ఒలంపిక్ మెడలిస్ట్, మాజీ ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ పిఆర్ శ్రీజెష్ సరికొత్త యెజ్డీ గ్రీన్ మంబా భారతదేశంలో తొలి కస్టమర్ గా రోడ్ స్టర్ డెలివరీ తీసుకున్నారు. కొత్త యెజ్‌డీ శ్రేణి అనుభవం కలిగిన శ్రీజేష్ గ్రీన్ మంబ రోడ్ స్టర్ విలక్షణమైన స్టైలింగ్ కు ఆకర్షితులయ్యారు.
334- సిసి లిక్విడ్-కూల్ ఆల్ఫా 2 ఇంజన్ ద్వారా మద్దతు చేయబడిన సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, మాడ్యులార్ సీటింగ్‌తో మోటార్ సైకిల్ యె జ్‌డీ ఆధునిక సామర్థ్యంతో రూపొందించారు. ఫీల్ బయట ఉండే జీవితం కూడా ఎల్లప్పుడూ మైదానంలో జరిగే విషయాల కంటే ప్రధానమైనవి తాను నమ్ముతానన్నా రు. కొచ్చీలో యెజ్‌డీ గ్రీన్ మంబా రోడ్ స్టర్ విడుదలైన వెంటనే తనను ఆకర్షించిందన్నా రు. దీని డిజైన్‌లో ఏదో ప్రత్యేకత కనిపించాయన్నారు. పిఆర్ శ్రీజెష్ గ్రీన్ మంబా రోడ్ స్టర్ తొలి కస్టమర్‌గా మారడంతో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మోటార్ సైకిల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి.






