09-07-2025 03:21:53 PM
హైదరాబాద్: శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir)లోకి వరద ప్రవాహం(Flood Surge) గణనీయంగా పెరుగుతోంది, దీనితో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు, మూడు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని నియంత్రితంగా విడుదల చేయడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం జురాలా, సుంకేసుల వంటి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు ఇన్ ఫ్లో 1,86,064 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,45,776 క్యూసెక్కుల చొప్పున ఉప్పొంగుతుండడంతో, 885 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కలిగిన ఈ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 882.10 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.