23-01-2026 04:53:58 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): ప్రతిష్టాత్మక రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఆఫీసర్ గా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ న్యాయవాది ఎస్. ప్రదీప్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర మాజీ హైకోర్టు న్యాయమూర్తి జి. యతిరాజులు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ చే నియమించబడ్డారని, గురువారం ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ నెల 30 న జరగబోయే ఎన్నికల కి సంబంధించి లక్షెట్టిపేట పోలింగ్ ఆఫీసర్ గా ఎస్.ప్రదీప్ కుమార్ న్యాయవాది వ్యవహరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ...తనకు అప్పగించిన బాధ్యతను చట్టబద్ధంగా శాంతియుతంగా ఎలక్షన్ నిర్వహిస్తానని తెలిపారు.