ఐఐటీ, జేఈఈ ఫలితాల్లో ప్రగతి ఉత్తమ ప్రతిభ
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్-2025 ఫలితాలలో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల(Pragathi Junior College) విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. వివిధ క్యాటగిరిలలో ర్యాంకులు సాధించిన మా కళాశాల విద్యార్థులు ఆర్. క్రిష్ణ - 480వ ర్యాంకు సాధించి కళాశాల టాపర్గా నిలిచాడు. ఇదే విధంగా కళాశాలకు చెందిన డి. చరణ్ -1569, డి. చరణ్ -2960, కె. సమీరా -4122 ర్యాంకులు సాధించి ప్రగతి జూనియర్ కళాశాల ది బెస్ట్ కళాశాల అని నిరూపించిచారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాశాల విద్యార్థులను అందుకు సహకరించిన వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందానికి కళాశాల చైర్మన్ చందాకృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ. నరేందర్ బాబు, ఎన్. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ళ రమేష్ రెడ్డి, అభినందనలు తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికబద్దమైన విద్యాబోధన, అంకితభావం కలిగిన యాజమాన్యం అధ్యాపకబృందం కృషివలన ఉ త్తమ ఫలితాలు సాధించడం జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు.






