ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్, జూన్ 29(విజయ క్రాంతి): ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. సోమవారం మే డ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుం డి వచ్చిన అర్జీదారులను డిఆర్‌ఓ మాలతి తో కలిసి అదనపు కలెక్టరు (95) దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదన పు కలెక్టరు మాట్లాడుతూ ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను ప రిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వ ద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సి న బాధ్యత మనందరి పైన ఉన్నదని అదన పు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూడాలని అదనపు కలెక్టరు అన్నారు.
అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టరు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






