నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్
30-06-2026 12:00 AM
ఐదుగురి అరెస్ట్
వేములవాడ, జూన్ 29(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలం, నూకలమ ర్రిలో పంచాయతీ కార్యదర్శి పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో ఐదుగురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ పంచాయతీ కార్యదర్శి రమ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, తాళ్లపల్లి సాగర్, తాళ్లపల్లి లత, తాళ్లపల్లి చంద్రవ్వ, గుడిసె విష్ణువర్ధన్, మంద అభినయ్లను వేములవాడలో అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, రిజిస్ట్రేషన్ పత్రాలను స్వా ధీనం చేసుకున్నట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.






