14 July, 2026 | 4:49 AM

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

14-07-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.

ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగుల నివారణ

19 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వా రా నులిపురుగులను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురుకుల పాఠశాలలో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం వి ద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.

ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి

ప్రాథమిక విద్యే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జిల్లా స్థాయి ఎంఆర్పీల మూడు రోజుల సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆధునిక బోధనా విధా నాలను సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపర చాలని ఉపాధ్యాయులకు సూచించారు.

గిన్నిస్ వరల్ రికారడ్స్ సాధించిన విద్యార్థులకు సన్మానం

తైక్వాండో, కరాటే విభాగాల్లో గిన్నిస్ వరల్ రికారడ్స్ సాధించిన కె. నవనీత్ చంద్ర, కట్కూరి త్రీనాథ్, కే. అశ్విత్ యాదవ్లకు జిల్లా కలెక్టర్ కె. హరిత సర్టిఫికెట్లు, పతకాలు అందజేసి అభినందించారు. మరి న్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సా ధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

టీ-ఫైబర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో టీ-ఫైబర్ సేవల విస్తరణపై ప్రత్యే క దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. టీ-ఫైబర్ విస్తరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ కా ర్యాలయాలు, విద్యాసంస్థల్లో మెరుగైన ఇం టర్నెట్ సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.