14 July, 2026 | 4:52 AM

విద్యార్థులు విద్యలో రాణించాలి

14-07-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూలై 13(విజయక్రాంతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని, విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం  కవాడిగూడ డివిజన్ లోని గవర్నమెంట్ స్కూల్లో బీఆర్‌ఎస్ నాయకుడు విద్యాసాగర్ విద్యార్థి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ  కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్   ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కల్వ గోపి, రాజశేఖర్ గౌడ్, సాయి కుమార్, శ్రీకాంత్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.