విద్యుత్ షాక్‌తో పాడిగేదె మృతి
14-07-2026 12:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 13: విద్యుత్ షాక్ తో పాడిగేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వేల్పుచర్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత రైతు ఉగ్గం సంతోష్,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే తన పాడి గేదె గ్రామ సమీపంలోని ప్రాంతానికి మేతకు తీసుకెళ్లగా అక్కడ మేతమేస్తున్న క్రమంలో అప్పటికే తెగిపడిన విద్యుత్ ఎల్టీ లైన్ వైరు తగిలి గేదె అక్కడికక్కడే మృతి చెందింది.మృతి చెందిన పాడి గేదె విలువ రూ.40 వేలు ఉంటుందని,ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత రైతు సంతోష్ వేడుకున్నాడు.






