8 June, 2026 | 6:13 PM

Breaking News

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •  

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

08-06-2026 04:57 PM

* వసంతరావు జాదవ్.. ఏపీవో జనరల్..

ఉట్నూర్,(విజయక్రాంతి): సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవో జనరల్ వసంతరావు అన్నారు. సోమవారం కార్యాలయం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన సెమేష్ తనకి  బోర్ వెల్ మంజూరు కల్పించామని దరఖాస్తు చేశారు. ఇచ్చోడా మండలం దేవుల నాయక్ తండా గ్రామానికి  చెందిన విశాల్ తనకి ల్యాప్ టాప్ మంజూరు కొరకు అర్జీ కోరారు.

ఇంద్రవెల్లి మండలం దొడందా గ్రామానికి చెందిన లక్ష్మి తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కల్పించామని  అర్జీ కోరారు,కడెం మండలం ఇష్టంపూర్ గ్రామానికి చెందిన వెంకటి తనకి త్రీ ఫేస్ కరెంటు ఇప్పించమని అర్జీ .నార్నూర్ మండలం చిత్తగూడ గ్రామానికి  చెందిన శ్రీలత తనకి ఏదైనా ఉపాధి కల్పించమని కొరకు అర్జీ కల్పించామని దరఖాస్తు పెట్టారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.