28-11-2025 08:21:07 PM
ఒడితల ప్రణవ్ బాబు
హుజురాబాద్,(విజయక్రాంతి): జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో జ్యోతి బాపులే 136వ వర్ధంతి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రణబాబు జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్య సమాన హక్కు అని నినదించిన వ్యక్తి. ఆయన ఆశయాలు అందరికి స్ఫూర్తిదాయకం అన్నారు.
సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహొన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావుబా పూలే అని చదువుతోనే అభివృద్ధి సాధ్యమని,ఆది అందరి హక్కు అని,అక్షరాస్యత అందరికి అందాలని కొట్లాడారని,ఆయన స్ఫూర్తితో హుజురాబాద్ నియోజకవర్గంలోనీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు.ఇటీవల విడుదల అయిన 15కోట్ల అభివృద్ధి నిధుల్లో భాగంగా హుజురాబాద్ పట్టణంలో కోటి ముప్పై లక్షలతో 4 ప్రధాన చౌరస్తాలను అభివృద్ధి చేస్తున్నామని దాంట్లో ఒకదానికి జ్యోతి బా పూలే పేరు పెడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో పూలే అభిమానులు,పలు సంఘాల నాయకులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.