28-11-2025 08:14:03 PM
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ: క్రీడల్లో ఓటమి చెందిన క్రీడాకారులు ఓటమికి కుంగి పోకుండా తిరిగి సాధన చేసి విజేతలుగా నిలవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని సిసిఆర్ విద్యానిలయంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న 19వ సిఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. కాగా గత నాలుగు రోజులుగా హోరీగా జరిగిన జాతీయ స్థాయి క్రీడలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 29 పాఠశాలల నుండి 1450 మంది కబడ్డి, వాలీబాల్, హ్యాండ్ బాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్, స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ప్రాతినిధ్యం వహించారు.
ప్రోవిన్షియల్ సుపీరియర్ ఉడుముల శౌరీలు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ సుపీరియర్ జనరల్ సిస్టర్ ఆల్ఫోన్సా, సిస్టర్ నక్షత్రం, సిస్టర్ శాంతా మేరీ, సిస్టర్ ఇరుదయం జూలియట్, సిస్టర్ విజయ ఫాదర్ ఫజోసాఫ్ రెడ్డి పాఠశాల హెచ్ఎం సిస్టర్ అన్ జ్యోతి, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఎంఈఓ సలీం షరీఫ్,బాల్ రెడ్డి, సుందరి వెంకటేశ్వర్లు, లామ్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.