calender_icon.png 28 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిబా ఫూలే 132వ వర్ధంతి సందర్భంగా నివాళులు

28-11-2025 08:10:01 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు ఫూలే 132వ వర్ధంతి సందర్భంగా ముదిరాజ్ మండల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శాత్ర బోయిన లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాత్ర బోయిన లక్ష్మణ్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే సమాజంలో ఉన్న అంటరానితనం నిర్మూలన, అక్షరాస్యత ప్రాచుర్యం, సామాన్య ప్రజలకు సమానత్వం కల్పించడంలో ముందడుగు వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు శివంది దేవేందర్ మాట్లాడుతూ ఫూలే ప్రవేశపెట్టిన ఆలోచన విధానం, సామాజిక సమానత్వ భావజాలం ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అత్యంత అవసరమని చెప్పారు.