calender_icon.png 28 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇర్కోడ్ మోడల్ స్కూల్ విద్యార్థులకు జిల్లా ప్రథమ్యం

28-11-2025 08:17:54 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో పిఎం శ్రీ మోడల్ స్కూల్ ఇర్కోడ్ విద్యార్థులు ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం విభాగంలో జిల్లా ప్రథమ స్థానం సాధించారు. ఈ పోటీల్లో 14 మోడల్ స్కూల్స్, 26 కెజిబివిలు, 12 గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వారిని అధిగమించి ఇర్కోడ్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉదయ్, మైఖేల్, త్రినేత్ర ప్రతిభావంతంగా రాణించారు. వారి విజయాన్ని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.