calender_icon.png 28 November, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా: అర్జుల సునీత సుధాకర్ రెడ్డి

28-11-2025 08:05:52 PM

తరిగొప్పుల,(విజయక్రాంతి): తరిగొప్పుల ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అర్జుల సునీత సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తరిగొప్పుల కేంద్రంలో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో సర్పంచి అభ్యర్థిగా అవకాశం వచ్చినందున పోటీ చేయడానికి బరిలో ఉంటున్నానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తామని, నిత్యం గ్రామంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం తనకు ఓటు వేసి ప్రజలు గెలిపించాలని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమం కోరే ఏకైక పార్టీ ప్రజల మద్దతు ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు.