calender_icon.png 26 December, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడా నిర్మాతలు వర్సెస్ చోటా నిర్మాతలు

26-12-2025 04:41:41 PM

బడా నిర్మాతలపై చిన్న నిర్మాతలు ఫైర్

దాసరి, రామానాయుడు ఆత్మలు ఘోషిస్తుంటాయి

బడా నిర్మాతలపై చిన్న నిర్మాతలు ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం పనికిమాలిన వాగ్దానాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడున్న సినిమా పెద్దలను చూసి దాసరి, రామానాయుడు ఆత్మలు ఘోషిస్తుంటాయని ప్రసన్న కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకు ఇండస్ట్రీలో బతుకు కావాలి.. పదవులు కాదన్నారు. రానున్న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో బడా నిర్మాతలు వర్సెస్ చోటా నిర్మాతలన్న స్థాయిలో ఫైట్ ఫిక్స్ అయింది. చిన్న నిర్మాతలకు కూడా థియేటర్లు ఇవ్వాలని, టికెట్ ధరలు పెంచమని హామీ ఇవ్వాలన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతుల్లో ఉందని నిర్మాత ప్రసన్న కుమార్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. తమకు కూడా బెన్ ఫిట్ షోలు చిన్న సినిమాలకు కూడా ఇవ్వాలని ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తే ఎన్నికల నుంచి విత్ డ్రా చేసుకుంటామని సవాల్ విసిరారు. పెద్ద నిర్మాతలు లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లడం దారుణమన్నారు. చిన్న నిర్మాతలం సొంత డబ్బుతో నామినేషన్ వేశామన్న ప్రసన్న కుమార్ ఒకసారి అవకాశం ఇచ్చినా ఏం చేయలేదన్నారు. మెడిక్లెయిమ్ చేయిస్తామని అది కూడా చేయలేదని ప్రసన్న కుమార్ ఆరోపించారు.