calender_icon.png 26 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాన్స్ గురించి ముందే చెప్పారు!

26-12-2025 02:03:23 AM

ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో మహీధర్‌రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటుచేసిన ఇంటర్వ్యూలో కథానాయిక అర్చన పలు ఆసక్తికర విషయాలను విలేకరులతో పంచుకుంది. “నా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే నేను ఇక్కడవరకు వచ్చేదాన్ని కాదు. మా అమ్మ, అన్నయ్య నా కలలకు ఎప్పుడు అండగా నిలుస్తుంటారు. ముఖ్యంగా నా పాత్రల ఎంపిక విషయంలో వారిదే తొలి ప్రాధా న్యం.

కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ చిత్రాలను చూడడానికి ఇష్టపడటంలేదు. కొత్త కంటెంట్, ఆసక్తికరమైన అంశాలు ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. ‘శంబాల’లో నేను దేవి అనే పాత్రలో కనిపిస్తా.. చాలా విభిన్నమైన పాత్ర. కథను పూర్తిగా వినకుండానే ఓకే చేశా. రొమాంటిక్ సాంగ్స్, స్టెప్పులు వేసే పాత్ర కాదని ముందే చెప్పారు.

తొలిచిత్రంలోనే మంచి పాత్ర లభించడం ఆనందంగా ఉంది. ఎప్పుడూ నాకు సౌకర్యంగా ఉండే రోల్స్‌ను ఎంచుకునే ప్రయత్నమే చేస్తున్నా. సందేశాత్మక చిత్రాలు చేయాలనుకుంటా. ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనే కోరిక బలంగా ఉంది. జీవితంలో ఒక్కసారైనా అలాంటి పాత్ర చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఫాంటసీ మూవీ చేస్తున్నా. 500 ఏళ్ల క్రితం జరిగిన కథ అది. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు” అని తెలిపింది.