ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
మరోసారి ఉదారతను చాటిన నీలం మధు పుట్టిన పిల్లలకు 20వేలు జమ
పటాన్చెరు, జూన్ 19 : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ముత్తంగి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా, సేవా కార్య క్రమాలతో మిన్నంటాయి. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వేడుకల ను పండుగ వాతావరణంలో నిర్వహించా రు.
కేవలం కేక్ కటింగ్స్, హంగామా వంటి ఆడంబరాలకు పోకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు అండగా నిలిచేలా పలు వినూత్న సేవా కార్యక్రమాల ను చేపట్టడం ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాహుల్ గాంధీ జన్మది నాన్ని పురస్కరించుకుని నీలం మధు ముదిరాజ్ తన అపారమైన ఉదారతను చాటుకుంటూ పసికందుల భవిష్యత్తుకు భరోసా కల్పించారు.
పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జన్మించిన పసికందులకు వారి భవిష్యత్తు భద్రత కొరకు ప్రతి సంవత్సరంలాగే ఈ సారికూడా ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున ఫిక్స్ డిపాజిట్ చెక్కులను అందజేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రసవాలు చేసుకునే నిరుపేద కుటుంబాలకు ఈ సాయం కొండంత అండగా నిలిచింది. అదేవిధంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అహర్నిశలు శ్రమిస్తున్న జీహెచ్‌ఎంసీ సఫాయి కార్మికులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
అనంతరం వారి కుటుంబాలకు అవసరమైన నిత్యవసర వస్తువుల కిట్లను నీలం మధు ముదిరాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల పక్షాన నిలబడి మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నీలం మధు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, సంగన్నగారి గోపాల్, నరసింహ రెడ్డి, వెంకటేష్ నాయక్, రాఘవేంద్ర, నారాయణదాసు, సంపత్ రెడ్డి, మణికంఠ, సందీప్ గౌడ్, జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి, అశోక్ ముదిరాజ్, మధు పంతులు, గడ్డ యాదయ్య, గుండ్ల మహేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి,గోపాలకృష్ణ, సందీప్ యాదవ్, దశరథ్,ప్రవీణ్, విఠల్, రంజిత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొనారు..
నంగునూరులో..
నంగునూరు, జూన్ 19: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.నంగునూరు ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్,మాజీ మండల అధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ...దేశ సమగ్రత,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం,అణగారిన వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని పీఠాన్ని అధిరోహించడం ఖాయమని,ఆ లక్ష్యం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికునిలా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఏఎంసీ డైరెక్టర్లు గొట్టం రంగారెడ్డి, బానోతు జీవన్ నాయక్,పార్టీ నాయకులు పదిరే శ్యామ్ రెడ్డి,కరెడ్ల వెంకట్ రెడ్డి,గడ్డం కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






