03-07-2025 12:33:44 AM
హైదరాబాద్, జూలై 2(విజయక్రాంతి): మరో వెయ్యి బడుల్లో ప్రీ -ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్లు జూ న్ 11న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సిన విషయం తెలిసిందే. వీటితోపాటు మరో వెయ్యి ప్రభుత్వ స్కూళ్ల లోనూ ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రా రంభించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే దీనికి సంబం ధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమైంది. జూలై నెల గడుస్తోంది. ఈ క్రమంలో ప్రీ-ప్రైమరీ తరగతులకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత వాటిని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారులకు ముందు చూపులేకపోవడంతో విమర్శలొస్తున్నాయి.
విద్యాసంవత్సరం ప్రారంభమై విద్యార్థులంతా అందుబాటులో ఉండే ప్ర భుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు కూడా. ఒకవేళ అవి అందుబాటులోకి వచ్చినా ఆయా పాఠశాలల్లో విద్యార్థులు చేరే పరిస్థితి ఉండదు. అధికారుల అలసత్వం కారణంగా విద్యార్థులు నష్టపోయినట్లే అవుతోంది. కుదిరితే ఈ సంవత్సరం లేకుంటే ఇక వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రీ-ప్రైమరీ తరగుతులు ప్రా రంభించే అవకాశం కనబడుతోంది.