03-07-2025 02:30:58 AM
హైదరాబాద్, జూలై 2: గ్రూప్-1 పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు ఇరువైపుల వాదనలు విన్నారు. మెయిన్స్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, పునర్ మూల్యాంకనం లేదా మళ్లీ పరీక్షలు పెట్టాలని పిటిషన్లు వాదించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఒకే ఎవాల్యేయేటర్ రెండు మీడియం పేపర్లు ఎలా దిద్దుతారని ప్రశ్నించారు.
ఒకే వ్యక్తి రెండు భాషల్లో ఎలా నిపుణుడవుతారని అడిగారు. ఒకరితోనే రెండు భాషల్లో దిద్దించడంతో తెలుగు మీడి యం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 22 సెంటర్లలో రాసిన అభ్యర్థుల్లో ఒక్క శాతమే ఎంపిక కాగా, కోఠిలోని 2 సెంటర్ల నుంచి 12.5 శాతం ఎంపికయ్యారని, ఇందులో మతలాబు ఏమిటని ప్రశ్నిం చారు.
పరీక్షలకు సంబంధించి గతంలో కీ ఇవ్వలేదన్న టీజీపీఎస్సీ ఇప్పుడు ఇచ్చామని అబద్ధం చెబుతుందని వాదించారు. మూడోసారి పేపర్లు దిద్దినవాళ్లు మాన్యువల్‌గా మార్కులేశారని, దీంతో అక్రమాలు చోటుచేసుకున్నాయని కోర్టుకు తెలిపారు. మరో న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ అనర్హులతో పేపర్లు దిద్దించారని వాపోయారు.
మూ ల్యాంకనం పారదర్శకంగా జరిగిందని టీజీపీఎస్సీ తరఫు న్యాయ వాది నిరంజన్‌రెడ్డి వాదించారు. ఇరు వైపు ల వాదనలు విన్న న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు గురవారం నాటికి విచా రణను వాయిదా వేశారు. నేడు జరిగే విచారణలో వాదనలు పూర్తి చేయాలని ఇరుప క్షాల న్యాయవాదులకు సూచించారు.