03-07-2025 12:31:27 AM
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ నార్త్ డిస్కమ్ టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో కొత్తగా 339 పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో చీఫ్ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్, జాయింట్ సెక్రటరీ, సూపరిం టెండింగ్ ఇంజినీర్, జనరల్ మేనేజర్ (పీ అండ్ జీ), డివిజనల్ ఇం జినీర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, సబ్ ఇంజినీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ లైన్ ఇన్స్ పెక్టర్, అసిస్టెంట్ లైన్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, స్వీపర్ కమ్ గార్డినర్, స్వీపర్, శానిటరీ ఆర్డర్లీస్ పోస్టులున్నాయి. ఆర్థిక శాఖ అనుమతి లభించడంతో త్వరలోనే నోటీఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.