calender_icon.png 6 December, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీ వ్యాధి పట్ల జాగ్రత్తలు తప్పనిసరి: ప్రోగ్రామింగ్ అధికారి రఫిక్

06-12-2025 09:11:39 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న సిబి నాట్ ల్యాబ్‌ను శనివారం ప్రోగ్రామింగ్ అధికారి రఫిక్ ఆకస్మికంగా పరిశీలించారు. ల్యాబ్‌లో ఉన్న రెండు మిషన్ల పనితీరును, రోజువారీకి వచ్చు శాంపిల్స్ సంఖ్యను, నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను ఎల్టి సత్యారెడ్డి నుంచి అడిగి తెలుసుకున్నారు. జిల్లా టిబి యూనిట్ రికార్డులు, ఇటీవల అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఎక్స్‌రే యూనిట్ పనితీరుపై వాకబ్ చేశారు.

క్షయవ్యాధి అందరికీ అన్నివేళలా ముప్పు కలిగించే వ్యాధి కావడంతో గ్రామస్థాయిలో అవగాహన పెంచడం అవసరమన్నారు. ప్రతి గ్రామంలో టిబి లక్షణాలు ఉన్న వారిని పరీక్షా కేంద్రాలకు రప్పించి, తేమడ పరీక్షలు సులభంగా అందేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన ల్యాబ్ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన వారికి సకాలంలో మందులు అందించి, వ్యక్తిని–కుటుంబాన్ని–సమాజాన్ని కాపాడాలని సూచించారు. వారితో పాటు టిబి సూపర్వైజర్లు శ్రీనివాసులు, ఆరిఫ్ ఖాన్, ఎల్టి సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.