06-12-2025 09:15:33 PM
గుమ్మడిదల: హైదరాబాద్–బీఎచ్ఈఎల్ సహోదయ స్కూళ్ల క్లస్టర్ ఆధ్వర్యంలో శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల గుమ్మడిదలలో సబ్ జూనియర్ అండర్–16 బాలికల వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీ వివేకానంద హై స్కూల్, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్, కార్నర్ స్టోన్ స్కూల్, జ్యోతి విద్యాలయ హై స్కూల్, భారతీయ విద్యాభవన్, సెంటియా ది గ్లోబల్ స్కూల్ వంటి ప్రముఖ విద్యాసంస్థల నుండి ప్రతిభావంతులైన విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభ, సామూహిక భావన, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు.
ఇట్టి క్రీడ పోటీలలో మొదటి విజేతగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి, రన్నరప్ గా భారతీయ విద్యా భవన్ బిహెచ్ఇఎల్ విజేతలుగా నిలిచారు. ఈ టోర్నమెంట్ ప్రత్యేక దృష్టితో కార్పొరేట్ కల్చర్, గ్రామీణ సంస్కృతి మధ్య వారధిని నిర్మించడం అనే లక్ష్యంతో నిర్వహించబడింది. వైవిధ్యభరితమైన అనుభవాలు కలిసే ఈ వేదిక ద్వారా విద్యార్థుల పనితీరు, ఆత్మవిశ్వాసం,సమగ్ర అభివృద్ధి పెంపొందించడమే కాకుండా,గ్రామీణ విద్యార్థులను వ్యవస్థీకృత ప్రొఫెషనల్ క్రీడా వాతావరణానికి చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రిన్సిపాల్ లతా జైపాల్ రెడ్డి తెలిపారు.
టోర్నమెంట్ విజయవంతంగా పూర్తికావడానికి సహకరించిన అన్ని పాఠశాలలకు, బోధక సిబ్బందికి, అలాగే పీఈటీలు రమేష్, మధు, పూజిత, శ్రీకాంత్, అశోక్, మోహన్, వెంకట్, కె. అశోక్ లకు శ్రీ వివేకానంద హైస్కూల్ నిర్వహణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. విద్యార్థినుల ఉత్సాహం అందరినీ ఆకట్టుకోగా, పాఠశాల నిర్వహణ భవిష్యత్‌లో కూడా క్రీడలు మరియు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని పునరుద్ఘాటించింది. ఈ క్రీడల్లో బాలికలు ఆయా పాఠశాలల కోచులు ఇచ్చిన శిక్షణ తో క్రీడా ప్రదర్శనలను శ్రీ వివేకానంద పాఠశాల విద్యార్థులు చూసి తాము కూడా ఇలా నేర్చుకొని రానున్న రోజుల్లో ఎక్కడైనా క్రీడలు నిర్వహించిన అక్కడ పాల్గొని తాము కూడా క్రీడా ప్రదర్శనలు ఇచ్చి విజయాలు సాధిస్తామన్నారు.