26-08-2025 11:31:14 AM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల పౌర సరఫరాల శాఖ(Civil Supplies Department) ఎం.ఎల్.ఎస్ పాయింట్ ఇన్ఛార్జిగా జూనియర్ అసిస్టెంట్ బందెల ప్రేమ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన అసిస్టెంట్ గ్రేడ్-1 గంగాధరి రాజు బదిలీపై హనుమకొండకు వెళ్లగా, ఆయన స్థానంలో ప్రేమ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. బందెల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు.