26-08-2025 12:06:04 PM
హన్మకొండ టౌన్ (విజయక్రాంతి): కాలనీల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం అని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. వరంగల్ పశ్చిమ అభివృద్ధిలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 60వ డివిజన్ లోని ఎస్ బి హెచ్ కాలనీలో, మసీద్ లైన్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టారు. నిర్ణీత వ్యవధిలో నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రజలకు ప్రజా రవాణాకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నాణ్యత పరమైన ప్రమాణాలను పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్, మాజీ కార్పొరేటర్ నాగరాజు, డివిజన్ అధ్యక్షులు పున్నం చందర్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.