calender_icon.png 22 December, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా ముక్కోటి ఏర్పాట్లు

22-12-2025 12:00:00 AM

కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాచలం, డిసెంబర్ 21, (విజయక్రాంతి): ఈనెల 29, 30 తేదీలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం నకు సంబంధించిన అన్ని ఏర్పాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, అలాగే గోదావరి రివర్ ఫెస్టివల్ కు సంబంధించిన ఏర్పాట్లు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చేపడుతున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 

ఆదివారం భద్రాచలంలోని ఏరు ఫెస్టివల్ , గోదావరి కరకట్టల పక్కన కల్చరల్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.   ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డి ఈ వెంకటేశ్వర్, ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ రాము, డి ఈ రవితేజ, దేవస్థానం డి రవీందర్, ఏపీఎం త్రిగుణ, జగదీశ్వర్, జిపిఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.