22-12-2025 12:00:00 AM
టేకులపల్లి, డిసెంబర్ 21, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ చట్టం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఏ పేరును మార్చే ప్ర యత్నాలకు వ్యతిరేకంగా ఆదివారం టేకులపల్లి బోడు సెంటర్లో ధర్నా నిర్వహించి నిర సన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పా ర్టీ నాయకులు కోరం సురేందర్, టేకులపల్లి మండల అధ్యక్షులు దేవ నాయక్ లు మాట్లాడారు. పేదలు, కూలీలు, గ్రామీణ ప్రజల జీవనాధారమైన ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని అన్నారు. గ్రామీణ ఉపాధి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుంద ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అ ధ్యక్షులు భూక్యా దేవా నాయక్, ఈది గణేష్, తాజా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.