15-07-2025 12:00:00 AM
ముఖ్యఅతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ రాక
సిద్దిపేట, జూలై 14 (విజయక్రాంతి): ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు నెలకు చేయూత పెన్షన్ రూ.6వేలు, ఆసరా పెన్షన్లను రూ.4వేలు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు దండు శంకర్, ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లిగారి యాదగిరి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దివ్యాంగుల హక్కుల సాధనకై ఆగస్టు 13న హైదరాబాదులో దివ్యాంగుల సింహగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
దివ్యాంగుల సింహగర్జన కార్యక్రమం విజయవంతం చేయడం కోసం సిద్దిపేటలో ఈనెల 16న సన్నాక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సన్నాహక సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పాల్గొంటారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎస్ మెట్రో గార్డెన్లో జరిగే ఈ సన్నాహక సమావేశంలో చేయూత, ఆసరా, దివ్యాంగుల పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్టెల సంపత్, బొంగోని శ్రీశైలం, జింక యాదగిరి, పిడిశెట్టి నారాయణ, అసర్ల రమేష్, సిద్దిపేట జిల్లా ఎమ్మార్పీఎస్, ఎఎస్పీ కో-ఇంచార్జి పెర్క పర్శరాములు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.