calender_icon.png 15 July, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

500 విద్యార్థులు.. 2 బాత్రూమ్‌లు మాకు ఈ ప్రిన్సిపాల్ వద్దు బాబోయ్

15-07-2025 12:00:00 AM

శామీర్ పేట్ 14 జులై 2025: మాకు ఈ ప్రిన్సిపాల్ వద్దు అంటూ శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామం లోని కూకట్ పల్లి బ్రాంచ్ కి చెందిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పాఠశాల, కళాశాల విద్యార్థులు హాస్టల్ నుండి తుర్కపల్లి లోని రాజీవ్ రహదారి వరకు ప్రిన్సిపాల్ మారాలి, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాజీవ్ రహదారిపై భైటాయించారు.

అనంతరం హాస్టల్ గేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. తమకు స్నానం చేసుకోడానికి సరిపడ బాత్రూమ్ లు లేవని, బాత్రూమ్ డోర్లు లేవని, రెండో బాత్రూమ్ లు సరిగా ఉన్నాయన్నారు.

తినే అన్నం సరిగా లేదని, నెలకోసారి మార్చాల్సిన ఫుడ్ మెనూ మార్చడం లేదని, నీటి సమస్య తీవ్రంగా ఉందని, అపరిశుభ్రత తాగునీటితో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని బాగు చేయాలని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేస్తే దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు 500 మంది విద్యార్థులకు గాను రెండు బాత్ రూమ్ లు మాత్రమే ఉన్నాయని అవి కూడా సరిగా లేవని చెప్పారు. ఇప్పటికైనా తమకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.