జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి
అధికారులంతా ప్రజలతో మమేకం కావాలి
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలి
99 రోజుల కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలి
రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
సంగారెడ్డి/మెదక్, మార్చి 6 (విజయక్రాంతి): జిల్లా అభివృద్ధి సమిష్టి గా కృషి చేయాలని, అధికారులంతా ప్రజలతో మమే కం కావాలని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
99 రోజుల కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక పై ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణలో ఉమ్మడి మెదక్ జి ల్లాను మొదటి స్థానంలో ఉండేలా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలన్నారు.
ప్రజలతో మమేకమై వారితో కలిసి పనిచేసి నప్పుడే సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు అవకాశం ఉందని సీఎం భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీన్ని అమలుచ్చేసే భాద్యత అధికారులదే అన్నారు. వేసవికాలంలో త్రాగునీరు సమస్యరాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అవసరమైన ప్రాంతాలలో బోర్ల రిపేర్లు, ప్రత్యామ్నాయ తాగునీరు సరఫరాకు ప్రతిపదనలు పంపాలన్నారు. అసెంబ్లీలో చర్చించి త్రాగునీరు స మస్య రాకుండా కావలసిన తాత్కాలిక పను ల కోసం అనుమతులు తీసుకుంటాను అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక కార్యక్రమంలో భాగంగా 10 థీమ్స్ లలో రూ పొందించిన కార్యక్రమాలను ఆయా శాఖల ద్వారా పకడ్బందీగా నిర్వహించాలని వాటి తో పాటు 99 రోజుల ప్రణాళికను అన్ని శాఖలచే నిర్వహించాలని సూచించారు. నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫెడ్ వారు నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీనీ ప్రారంభించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రారంభించేలా చర్యలు తీసుకుం టానన్నారు. రెసిడెన్సియల్ స్కూల్లలో త్రాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునేలా వారిని మానిటర్ చెయ్యాలన్నారు.
గుమ్మడిదలలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సోలార్ విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించే సూర్య ఘర్ యోజన పథకం పై రివ్యూ చెయ్యాలన్నారు. ఏటిసిలు త్వరగా ని ర్మాణం అయ్యేలా టిజీఐఐసి చర్యలు తీసుకోవలని సూచించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో 6 గ్యారంటీలు ప్రజలకు పూర్తిగా అందేలా చూడాలని, నిర్మా ణంలో ఉన్నఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులచే గృహప్రవేశాలు చేయించాలని అన్నారు.
మన దేశ అవసరాలకు మించి వరి పంట దేశంలో పండు తుందని రైతులు లబ్ధి పొందేలా 30 శాతం పంట మార్పిడి చేయించాలన్నారు. అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆయిల్ ఫామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. విద్యా, వైద్యం చాలా ముఖ్యమని పేద ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్య సేవ లాందించాలన్నారు. రేషన్ కారడ్స్, డిజిటల్ హెల్త్ కారడ్స్ అర్హత ఉన్న పేదలందరికీ అందేలా చూడాలన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..
ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దుబ్బాకలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చెయ్యాలని, కొత్త మండలాల ప్రభుత్వ కార్యాలయాలకు సొం త భవనాలు నిర్మించాలన్నారు. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. రవా ణా శాఖ డ్రైవింగ్ లైషన్స్ ఇచ్చేటప్పుడు రో డ్డు భద్రత నియమాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం ఎంపీ సురేష్ షేట్కర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మహిళలకు హెల్త్ ప్రొఫైల్ చెక్ చేయాలని, వైద్య పోస్టులు భర్తీ చేయాలని, డాక్టర్లు అందుబాటులో ఉం డాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తు చేయాలన్నారు.
ఈ సమావేశంలో MLC చిన్నమైల్ అంజిరెడ్డి, నారాయ ణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, టి జి ఐ ఐ సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హై మావతి, సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్య, మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు, మెదక్ అదనపు కలెక్టర్లు నగేష్ , మాధురి, అబ్దుల్ హమీద్, మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లూ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.




