16 June, 2026 | 2:05 AM

నైరుతి నై!

16-06-2026 12:55 AM

ఉపగ్రహ చిత్రాల్లోకనిపించని మేఘాలు

జూన్ ౧౫ నాటికి కురవాల్సిన వర్షపాతం 53.7 మి.మీ

నమోదైన వర్షపాతం 19.2 మి.మీ మాత్రమే

అశనిపాతంలా పడమర జెట్ స్ట్రీమ్ గాలులు

తెలుగు రాష్ట్రాలపై వర్షాభావ పరిస్థితులు

న్యూఢిల్లీ, జూన్ ౧౫: జూన్ రెండో వారానికి యావత్ దేశానికి విస్తరించాల్సిన రుతు పవనాలు నిస్తేజంగా మారాయి. భారత వా తావరణ శాఖ (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో రుతు పవనాలు అక్కడక్కడా, అది కూడా పలుచగా కనిపించడం విస్మయం గొలుపుతున్నది. నిన్నమొ న్నటి వరకు దక్షిణ, మధ్య భారతంలోకి ప్రవేశించినట్లు కనిపించిన రుతుపవనాలు, ఇ ప్పుడు ఒక్కసారిగా మాయమవుతుండటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నది.

తాజా గణాంకాల ప్రకారం.. జూన్ 4  మధ్య వర్షపాత లోటు నమోదైంది. పదిరోజుల్లో సాధారణంగా 53.7 మి.మీ వర్షపా తం కురవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల కేవలం 19.2 మి.మీ వర్షపాతం మాత్ర మే నమోదైంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏకంగా 64% వర్షపాత లోటు ఏర్పడింది. దేశంలోని మధ్య, దక్షిణ, తూర్పు ప్రాంతాల మ్యాప్‌లు వర్షాలు లేక ఎండిపోయిన పరిస్థితిని సూచిస్తున్నాయి. భారత ఉపగ్రహం ‘ఇన్‌శాట్3 డీఎస్’ సోమవారం విడుదల చేసిన చిత్రాలు వాతావరణ శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

సాధారణంగా రుతుపవనాలు విస్తరిస్తున్న సమ యంలో యావత్ దేశం మొత్తం దట్టమైన మేఘాలతో కప్పి ఉండాలి. కానీ, ప్రస్తుత చిత్రాల్లో ద్వీపకల్ప, మధ్య భారతదేశమంతా పవనాల దొంతరలు లేకుండా కనిపిస్తున్నది. మేఘాల కదలికలు కేవలం హిమాలయా లు, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైనట్లు స్ప ష్టమవుతున్నది. అరేబియా సముద్రం వైపు నుంచి పవనాలు మరింత బలహీనంగా కనిపిస్తున్నాయి. సముద్ర జలాలపై తగినంత తే మ ఉన్నప్పటికీ వాతావరణ మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

వాతావరణంలో ఎగువన ఉండే ‘పశ్చిమ జెట్ స్ట్రీమ్’ గాలులు సాధారణ స్థానం కంటే చాలా దక్షిణానికి దూసుకొస్తున్నాయి. ఇవి రుతుపవనాలను ముందుకు నడిపే ‘తూర్పు జెట్ స్ట్రీమ్’ గాలులను అణచివేస్తున్నాయి. ఈ ఒత్తిళ్లలో వల్ల సముద్రం లో తేమ ఉన్నా కూడా మేఘాలు ఏర్పడటం లేదు.

ప్రస్తుతానికి రుతుపవనాలకు తాత్కాలిక విరామం మాత్రమే కలిగిందని, ఈ వారం చివర్లో పరిస్థితులు మళ్లీ అనుకూలంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల నిస్తేజ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోకి రు తుపవనాలు దూసుకువస్తున్నప్పటికీ, పశ్చి మ జెట్ స్ట్రీమ్స్ వాటికి అవరోధం కలిగిస్తున్నాయి. ఫలితంగా రెండు రాష్ట్రాల్లోని మెజా రిటీ జిల్లాల్లో వాతావరణం పొడిగా మారిం ది. చిరు జల్లులు తప్ప పెద్దగా వర్షాలూ కురవడం లేదు.