15 August, 2026 | 1:15 AM

పూజ వివరాలు, నియమ నిబంధనల సూచిక బోర్డు బహూకరణ

15-08-2026 12:45 AM

వెంకటాపూర్, ఆగస్టు 14 (విజయక్రాంతి) : మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ఆయనకు సాదర స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రామప్ప ఆలయానికి పూజా వివరాలు, నియమ నిబంధనలను తెలియజేసే స్టీల్ సూచిక బోర్డును బహు కరించారు. ఆలయ మండపంలో ఈవో ఇమ్మడి భాస్కర్ స్వామివారి శేషవస్త్రాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరినాథ్, పురావస్తు శాఖ కోఆర్డినేటర్ కుమారస్వామి, టూరిజం గైడ్ విజయ్ కుమార్, టూరిస్ట్ పోలీస్ అరుణ్ కుమార్, దేవాదాయ శాఖ సిబ్బంది మార్క సంతోష్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.